
అనంతపురము, సెప్టెంబర్ 06 : బహుజన వేదిక న్యూస్
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చూపుదామని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఇందులో భాగంగా పార్టీ అనుబంధ విభాగాలను బలోపేతం చేస్తున్నామని, యువజన విభాగం కీలక పాత్ర వహించాలని సూచించారు. ఆదివారం సాయంత్రం వైసీపీ జిల్లా కార్యాలయంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నగరంలోని 1, 2, 19, 27, 28, 29, 43, 44, 45, 46, 47, 48 డివిజన్లకు చెందిన యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు, వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అనంత వెంకటరామిరెడ్డి హాజరై దిశానిర్దేశం చేశారు. ఈరోజు జెన్జీ జమానా నడుస్తోందని, యువత అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. నీట్ పేపర్ లీకేజీపై యువత ఉద్యమిస్తే కేంద్ర మంత్రి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలోనూ మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీ నిర్వహించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కటిగా డీఎస్సీ స్పోర్ట్ కోటా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో సీఎం చంద్రబాబు విఫలం చెందారని తెలిపారు. నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నెలా నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఒక్కరికీ ఇవ్వలేదన్నారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సంక్షేమ గురించే ఆలోచిస్తుందని స్పష్టం చేశారు. కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. హామీలను నెరవేర్చాలని ప్రశ్నిస్తే ప్రభుత్వం అక్రమ కేసులు, అరెస్టులు చేస్తోందని, వీటికి ఎవరూ భయపడొద్దన్నారు.
పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు మధ్య తేడాను ప్రజలకు వాస్తవాలతో వివరించాలని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఒకే నోటిఫికేషన్తో 1.35 లక్షల సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేసి అక్రమాలకు పాల్పడిందని, పైగా ప్రచార ఆర్భాటం చేస్తోందని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో సంక్షేమ పథకాలను అందిస్తే అంతకంటే ఎక్కువగా ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కష్టపడిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహులు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు చంద్రమోహన్రెడ్డి, ఇసాక్, సంపంగి రామాంజినేయులు, శ్రీనివాసులు, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాకే శ్రీనివాసులు, వైసీపీ నేతలు హనుమంతు, రామచంద్ర, రాజు, నిమ్మల నాగరాజు, నారాయణరెడ్డి, అరవింద్, ప్రసన్న లక్ష్మి, అబ్బాస్, మనోజ్, కుమార్, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు దాదాఖలందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి లోకనాథ్రెడ్డి, మణిరాయల్, జిల్లా కార్యదర్శి హర్షవర్దన్, నగర అధ్యక్షుడు దత్త, ఉపాధ్యక్షుడు వినీత్, ఉదయ్, నగర ప్రధాన కార్యదర్శి మసూద్, మైను, నగర కార్యదర్శి రాంభూపాల్రెడ్డి, బబ్లూ తదితరులు పాల్గొన్నారు.









