ఘనంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం జిల్లాలోని వయోజనుల్లో 100 శాతం అక్షరాస్యత సాధించడమే అక్షర ఆంధ్ర లక్ష్యం

అనంతపురము రూరల్, సెప్టెంబర్ 08 : బహుజన వేదిక న్యూస్

60వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అనంతపురం రూరల్ మండల మహిళ సమాఖ్య కార్యాలయం ప్రాంగణంలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వణాధికారి (సిఈఓ) విజయలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలోని వయోజనుల్లో 100 శాతం అక్షరాస్యత సాధించడమే అక్షర ఆంధ్ర లక్ష్యం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని వినియోగించుకుని జిల్లాలోని స్వయం సహాయక సంఘాలలోని నిరక్షరాస్య మహిళలు,

విబి జి రాంజీ గ్రూపు సభ్యులలోని పురుషులు మరియు సమాజంలో 15 సంవత్సరాలు వయస్సు పైబడిన నిరక్షరాస్య వయోజనులు అందరూ ఈ కార్యక్రమం ద్వారా సెప్టెంబరు 08, 2026 నుండి ఫిబ్రవరి నెల 2027 వరకు నిర్వహించబడుతున్న ‘అక్షర ఆంధ్ర’ అభ్యసన తరగతులకు హాజరై చదువుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమములో జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారి నాసర రెడ్డి మాట్లాడుతూ 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే జిల్లాలోని నిరక్షరాస్యులను గుర్తించి ప్రతి పది మంది చదువురాని వారికి ఒక వాలంటరీ టీచర్ ని గ్రామములోని విఓఎ, ఫీల్డ్ అసిస్టెంట్ ల ద్వారా వెల్ఫేర్ అసిస్టెంట్స్ ఎంపిక చేయడం జరిగిందన్నారు. చదువు ఉంటే జీవితంలో స్థిర పడగలమని, అభివృద్ధి చెందగలమని, అందరు చదువుకోవాలని కోరారు. జిల్లా పంచాయతి అధికారి నాగరాజు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలందరూ అభివృద్ధి చెందాలన్నారు.

వయోజన విద్య ఉపసంచాలకులు ఎస్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈరోజు నుండి వాలంటీర్ టీచర్లు స్వచ్ఛందంగా బోధన చేస్తారని, అభ్యాసకులు దగ్గరలో గల అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ భవనాలలో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు తరగతులు నిర్వహించబడతాయన్నారు. అక్షర ఆంధ్ర యాప్ ద్వారా వీడియో పాఠాలు మరియు టెక్స్ట్ పుస్తకాలు అందజేయడం జరుగుతుందని, మొత్తం మీద 40 గంటలు పాఠ్యపుస్తకాలు, 45 గంటలు వర్క్ బుక్ ఎక్సర్సైస్, 15 గంటలు వీడియో పాఠాలు భోదించడం జరుగుతుందన్నారు. తదనంతరం మార్చి నెలలో NIOS వారు నిర్వహించే FLNA పరీక్షలలో ఉత్తీర్ణులైన వారిని అక్షరాస్యులుగా గుర్తించబడడం ద్వారా అనంతపురం జిల్లా అక్షరాస్యత అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు.వయోజన విద్య సహాయ సంచాలకులు బి.వి.భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ డిజిటల్ లిటరసీ ఫైనాన్షియల్ లీటరసీ, ఫంక్షనల్ లీటరసీపై మరింత అవగాహన పెంపొందించుకోవాలని స్వయం సహాయక సంఘ గ్రూపు సభ్యులకు తెలియజేశారు.మండల అభివృద్ధి అధికారి దివాకర్ మాట్లాడుతూ అనంతపురం రూరల్ మండలాన్ని చదువుకున్న విద్యార్థినీ విద్యార్థుల సహకారంతో వయోజనులలో అక్షరాస్యత అభివృద్ధిని సాధిస్తామని హామీ ఇచ్చారు. అక్షర ఆంధ్ర కార్యక్రమం ప్రత్యేకించి SHG గ్రూపు సభ్యులకు చాలా ఉపయోగపడుతుందని, దీని ద్వారా సమాజంలో పేదరికం నిర్మూలించవచ్చని, వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అనంతపురం వయోజన విద్య సిబ్బంది పి.సూర్యనారాయణ, పర్యవేక్షకులు జి.పరమేశ్వరప్ప, జి.వి.రమణ, జి.రవి, పి.శ్రీధర్, ఎం.లక్ష్మినారాయణ, ఎ.పి.ఎం రవి, ఎ.పి.ఓ నాంచారమ్మ, వెలుగు సీసీలు, వివోఏలు, SHG గ్రూపు సభ్యులు, ఎన్ఆర్ఈజిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్స్ పాల్గొన్నారు. పొదుపు మహిళలు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, పాటల ద్వారా చదువు ప్రాధాన్యత గురించి వివరించడం అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం పక్షోత్సవాలలో భాగంగా వివిధ కాళాశాలలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు జ్ఞాపికలు అందచేయడం జరిగింది

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :