బద్వేలు నుండి పల్లె పండుగ 3.0 కు భారీగా తరలివెళ్లిన ప్రజలు

బద్వేలు, సెప్టెంబర్ 29: బహుజన వేదిక;

బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బద్వేలు నియోజకవర్గ ఇన్‌చార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి సుమారు 6,700 మంది ప్రజలు బస్సులలో రామాపురానికి తరలివెళ్లారు.

ఈ సందర్భంగా సూర్యనారాయణ బస్సులకు రెడ్డి జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.కార్యక్రమానికి తరలివెళ్లిన ప్రజలకు భోజన ఏర్పాట్లు కూడా చేశారు.

పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి బద్వేల్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో జనసంద్రంగా మారింది ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సంబంధిత అధికారులు, సిబ్బందికి మంచూరు సూర్యనారాయణ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

రామాపురంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో పాటు, గ్రామీణ అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :