
బద్వేలు, సెప్టెంబర్ 09: బహుజన వేదిక న్యూస్
రానున్న వినాయక చవితి పర్వతనాన్ని పురస్కరించుకొని బుధవారం బద్వేలు ఆర్డీవో కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బద్వేలు ఆర్డీవో చంద్ర మోహన్, డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, ఫైర్, విద్యుత్, మున్సిపల్, పంచాయతీరాజ్ మరియు తదితర శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ మరియు శాంతి కమిటీల సభ్యులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఆర్డీవో డిఎస్పి వినాయక మండపాల ఏర్పాటుకు ముందస్తు ఆన్లైన్ అనుమతులు తప్పనిసరి గా తీసుకోవాలని అన్నారు గణేష్ ఉత్సవ్’ పోర్టల్ ద్వారా నిర్వాహకులు దరఖాస్తు చేసుకోవాలి అని తెలియజేశారు మండపాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగేలా రహదారులను ఆక్రమించొద్దు బాణసంచా వినియోగంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అన్ని శాఖల సమన్వయం నిబంధనలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని నిర్వాహకులకు సూచన చేయడం జరిగింది









