సుందరయ్య కాలనీలో తిష్ట వేసిన పారిశుధ్యం

బద్వేలు సెప్టెంబర్ 29 : బహుజన వేదిక;

బద్వేల్ మున్సిపాలిటీ పరిధి 18 వ వార్డు స్పటిక లింగం శివాలయం ఏరియాలోని సుందరయ్య కాలనీలో డ్రైనేజీ కాలువలు సీసీ రోడ్లు లేకపోవడంతో ఆ కాలనీ వాసులు అనేక అవస్థలు పడుతున్నామని తెలియజేశారు కాలనీలో దాదాపు 20 సంవత్సరాలు పైగా అక్కడ ప్రజలు నివాసమంటూ మున్సిపాలిటీకి పన్నులు చెల్లిస్తూ ఉంటున్నారు, అయితే మున్సిపల్ అధికారులు ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిస్థాయిలో విఫలమయ్యారని సుందరయ్య కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, సుందరయ్య కాలనీకి చుట్టుపక్కల ఉన్న కాలనీలలోని డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో ఆ నీరంతా సుందరయ్య కాలనీలో రోడ్డుపైన నిలబడి పాచి పట్టి ఉండడంతో ఆ రహదారులు చిన్నారులు వృద్ధులు వాహనదారులు సైతం వెళ్లాలంటే కాలు పెడితే అక్కడ ఏం జరుగుతుందో అనే భయాందోళనలో కాలనీవాసులు వాపోతున్నారు, ముఖ్యంగా ఆ కాలనీలోని చిన్నారులు పాఠశాలలకు వెళ్లాలంటే ప్రతి రోజు పాచిపట్టిని నీళ్లలో నడవక తప్పదు అక్కడ కిందపడి గాయాలైన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి, ముఖ్యంగా రాత్రి సమయంలో నీరు స్తంభించడంతో దుర్వాసనతో దోమల వ్యాప్తితో దోమ కాటుకు గురై విష జ్వరాలకు కూడా గురవుతున్నామని స్థానిక ప్రజలు వాపోతున్నారు, ఇటీవల బద్వేలు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ సూర్యనారాయణ రెడ్డి వార్డులో పర్యటించినప్పుడు కనీసం మౌలిక వసతులు కల్పించాలని వార్డు ప్రజలు నాయకులకు విన్నవించుకున్నామన్నారు, అయినా అయినప్పటికీ స్తంభించిన నీటిని తరలించడంలో కూడా మున్సిపల్ అధికారులు జాప్యం చేస్తున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఇప్పటికైనా సుందరి కాలనీలో తి స్టవేసిన వేసిన డ్రైనేజీ సమస్యను పరిష్కరించి కనీసం మౌలిక వసతులు అయినా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని మౌలిక సదుపాయాలు కాలనీ వాసులు పోతుగంటి నాగూర్ భాష, షేక్ ఖాజాబీ, షేక్ కరీమునిషా, షేక్ గౌస్య మరియు కాలనీవాసులు కోరారు

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :