బెస్ట్ యూనివర్సిటీ ఆగడాలు అరికట్టాలి ఉన్నత విద్యా మండలి కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన పి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర

గోరంట్ల సెప్టెంబర్ 09: బహుజన వేదిక న్యూస్

శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో నిర్వహిస్తున్న బెస్ట్ యూనివర్సిటీ (భారతీయ ఎలక్ట్రానిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ) ఆగడాలను అరికట్టి విద్యార్థులను మానసిక, శారీరక వేధింపుల నుండి రక్షించాలని, వారి భవిష్యత్తును కాపాడాలని విజయవాడలోని ఉన్నత విద్యా మండలి కార్యాలయము నందు కమిషనర్ కు ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర వినతి పత్రము అందజేయడం జరిగింది. బెస్ట్ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులను యాజమాన్యం ఫీజులు పేరుతో మానసికంగా, శారీరకంగా హింసిస్తూ వారిని అనేక బాధల కు గురిచేస్తుంది. ఆఫ్లైన్ అటెండెన్స్ వేస్తూ కండోనేషన్ ఫీజు వేలకు వేలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. చెల్లించలేని పేద విద్యార్థుల పట్ల ఏమాత్రం దయాదక్షిణ్యం లేకుండా మిడ్ మరియు సెమిస్టర్ ఎగ్జామ్స్ కు అనుమతించకుండా వారి విద్యా భవిష్యత్తు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తున్నారని ఇలా పరీక్షలు అనుమతించకపోవడం వల్ల విద్యార్థులు ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేశారు అయినా కూడా యాజమాన్యం ఏమాత్రం లెక్కచేయకుండా విద్యార్థులకు మెస్ లో నాణ్యతలేని లేని అన్నం పెడుతున్నారు అందులో పురుగులు, జెర్రెలు, ఈగలు, దోమలు వస్తున్న కూడా మేం పెట్టిందే తినాలి లేకపోతే మీ ఇష్టం వచ్చింది చేసుకోండని విద్యార్థినులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మెస్ బిల్ కట్టడం ఒకటి రెండు రోజులు లేట్ అయితే వారికి భోజనం పెట్టకుండా ప్లేట్లు లాక్కొని కడుపు మాడ్చుతున్నారు ఇలా చేయడం వల్ల విద్యార్థునులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు హాస్టల్కు క్యాంటీన్ కు దాదాపు కిలో మీటర్ దూరం ఉంది రాత్రులు అంత దూరం రాకపోకలు చేసి అక్కడే భోజనం చేయాలి దారిలో చీకట్లో పురుగులు, పాములు తిరుగుతున్న అలాగే ఇక్కడికే వచ్చి తినండి అని అమ్మాయిలను కూడా రప్పిస్తున్నారు ఇదేమిటిని ప్రశ్నించిన విద్యార్థులను టార్గెట్ చేసి వారిని ఫెయిల్ చేస్తామని బెదిరిస్తూ సమాచారం బయటకు చెబితే మీ అంతు చూస్తామని సెక్యూరిటీ గార్డులు చేత వార్నింగ్ ఇప్పిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అలాగే యూనివర్సిటీకి చుట్టూ రక్షణ కూడా లేక అమ్మాయిలకు రక్షణాపరమైన భద్రతా లోపాలు కలుగుతున్నాయని యూనివర్సిటీలో అనేక కోర్సులకు తగిన అనుమతులు కూడా లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయని వీటన్నిటి పైన విచారణ చేసి యూనివర్సిటీ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకొని వారి ఆగడాలు ఆరికట్టాలని ప్రగతిశీల విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :