శాంతియుత వాతావరణంలో వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలిఎస్పీ పి.జగదీష్ ఐపిఎస్ ఆదేశాలతో పోలీసుల అవగాహన కార్యక్రమాలు

జిల్లా వ్యాప్తంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులతో పోలీసుల సమావేశాలు

అనంతపురము సెప్టెంబర్ 09: బహుజన వేదిక న్యూస్

వినాయక చవితి వేడుకలను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో, పోలీసు ఉన్నతాధికారుల మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించుకోవాలని జిల్లా పోలీసులు సూచించారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఐపిఎస్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా డీఎస్పీల పర్యవేక్షణలో సీఐలు, ఎస్సైలు తమ తమ పోలీస్ స్టేషన్ల పరిధిలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, గ్రామ పెద్దలతో బుధవారం ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహకులు పాటించాల్సిన పలు భద్రతా నియమాలను అధికారులు స్పష్టం చేశారు ​ముందస్తు అనుమతులు మంటపాల ఏర్పాటుకు ఆన్‌లైన్/పోలీస్ శాఖ ద్వారా ముందస్తుగా అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి.విద్యుత్, అగ్నిమాపక జాగ్రత్తలు: నాణ్యమైన విద్యుత్ వైరింగ్ ఉపయోగించాలని, ప్రమాదాల నివారణకు మండపాల వద్ద నీరు, ఇసుక బకెట్లు, అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. డీజేలపై నిషేధం : ఉత్సవాల్లో డీజేల వినియోగానికి ఎలాంటి అనుమతి లేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పరిమితికి లోబడి మాత్రమే సౌండ్ సిస్టమ్స్ వాడుకోవాలి.వాలంటీర్ల నిఘా : ప్రతి మంటపం వద్ద నిర్వాహకులు, శిక్షణ పొందిన వాలంటీర్లు నిరంతరం అందుబాటులో ఉంటూ రక్షణ చర్యలు పర్యవేక్షించాలి.మంటపాల వద్ద, నిమజ్జన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నవరాత్రి ఉత్సవాలను, ఊరేగింపులను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా జరుపుకొని పోలీసు వ్యవస్థకు సహకరించాలని కోరారు.​ఈ సమావేశాల్లో ఆయా ప్రాంతాల సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బందితో పాటు స్థానిక ఉత్సవ కమిటీ ప్రతినిధులు, యువకులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :