
అనంతపురము, ఆగస్టు 20 : బహుజన వేదిక న్యూస్ అనంతపురము కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో గురువారం జాతీయ రహదారి 544D నిర్మాణానికి అదనపు భూముల సేకరణకై జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆధ్వర్యంలో 3G బహిరంగ విచారణ నిర్వహించడం జరిగింది ఈ విచారణలో భాగంగా రైతుల యొక్క హక్కు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎవరికి ఎంత భూమి ఉంది మరియు దానికి సంబంధించిన హక్కులను నిర్ధారించి, రైతుల సమస్యలు కానీ, భూమి నష్టపరిహారం ధర విషయానికి సంబంధించిన అంశాలపై చర్చించి, సమగ్ర విచారణ చేపట్టిన అనంతరం నిర్ణయాన్ని ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఈ సెక్షన్ సూపరింటెండెంట్ రియాజుద్దీన్, తాడిపత్రి తహశీల్దార్ రామచంద్ర, పుట్లూరు తహశీల్దార్ బాలమ్మ, తదితరులు పాల్గొన్నారు.









